Wednesday, October 19, 2016

అమ్మలేకుండానే క్యాబినెట్ మీటింగ్

పన్నీర్ సెల్వం అధ్యక్షత తమిళనాడు క్యాబినెట్ భేటీ ; కీలక అంశాలపై చర్చ



తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురైన నేపధ్యంలో తొలిసారి  రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైంది. జయలలిత గత కొన్ని రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం ఆమె ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉన్నతరుణంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జయలలిత ఆధీనంలో ఉన్న ఎనిమిది శాఖలు ఆయన చూసుకుంటున్నారు. అమ్మ లేకుండా నేడు పన్నీర్‌సెల్వం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. గతంలో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు కూడా పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విషయం విదితమే. నేటి సమావేశంలో  కర్ణాటకతో నెలకొన్న కావేరీ జలాల వివాదం ప్రధాన అజెండాగా చర్చించారు. కావేరీ వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేబినెట్‌ దీనిపై చర్చించింది. 

No comments:

Post a Comment