Thursday, October 20, 2016

పిట్టకొంచం... కూత ఘనం

చిన్న వయస్సులో రిఫరీ శిక్షణ; చిన్నారి రికార్డు

తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన తైక్వాండో రిఫరీ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో నాగాయలంక విద్యాభారతి పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ప్రిహాన్స్‌(7) శిక్షణ పొంది రికార్డు నెలకొల్పింది. నాగాయలంకకు చెందిన ఈశ్వర్‌ డ్యాన్స్‌ అండ్‌ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన ప్రిహాన్స్‌ ఇప్పటికే బ్లాక్‌ బెల్ట్‌ సాధించగా విశాఖపట్నంలో జరిగిన రిఫరీ శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యింది. భారతదేశంలో అతి చిన్న వయసులో బ్లాక్‌ బెల్ట్‌ సాధించటంతో పాటు రిఫరీ శిక్షణ పొందిన తొలి బాలికగా గుర్తింపు పొందిందని పాఠశాల కరెస్పాండెంట్‌ రత్నారావు తెలిపారు. ప్రిహాన్స్‌కు శిక్షణ ఇచ్చిన మాస్టర్లు ఈశ్వర్‌, విశ్వలను పాఠశాల ప్రిన్సిపల్‌ ఏవివి శేషుబాబు, పాఠశాల గౌరవాధ్యక్షుడు మండవ పిచ్చియ్యలు చిన్నారికి అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment