Wednesday, October 19, 2016

రాకుమారుడైనా తప్పు చేస్తే శిక్షతప్పదు

సౌదీ రాకుమారుడికి ఉరి శిక్ష అమలు



ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో సౌదీ రాకుమారుడికి నేడు మరణశిక్ష అమలు చేశారు. 2012లో రియాద్‌ శివారులోని ఓ క్యాంప్‌లో జరిగిన ఘర్షణలో అదెల్‌ అల్‌ మహెమిద్‌ అనే వ్యక్తిని సౌదీ రాకుమారుడు టుర్కీ బిన్‌ సౌద్‌ అల్‌-కబీర్‌ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో కబీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదెల్‌ను కబీర్‌ హత్య చేసినట్లు 2014లో రియాద్‌ కోర్టు నిర్ధారించి మరణశిక్ష విధించింది. దీంతో బుధవారం అతడికి శిక్ష అమలుచేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.


No comments:

Post a Comment