చేతగాని మంత్రి వల్లే శనగల కోసం రైతుల ఇబ్బందులు
కడపలో శనగలకోసం రైతుల పాట్లు...పట్టించుకోని ప్రభుత్వం
తొండూరు మండలంలో శనగల కోసం రైతన్నలు రోడ్డెక్కారు. స్టాకు లేవని చెబుతూ పంపిణీ చేయకపోవడంపై వారు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తొలుత రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా, ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా బైఠాయించి వాహనాలను అడ్డుకోకూడదని వారించారు. వ్యవసాయాధికారి కిషోర్‌నాయక్‌కు సమాచారం ఇచ్చామని, ఆయన వచ్చిన తర్వాత విషయం అడిగి తెలుసుకుందామని చెప్పారు. వ్యవసాయాధికారి కిషోర్‌నాయక్ అక్కడికి రాగానే రైతులు స్టాకులేదన్న విషయం తమకు తెలిపి ఉంటే వ్యయ, ప్రయాసలకు ఓర్చి ఇక్కడికి వచ్చి ఉండేవారం కాదని, ఎందుకు తెలపలేదో సమాధానం చెప్పాలంటూ పట్టుపట్టారు. మంగళవారం రాత్రి ఆధార్ వివరాలు సమర్పించిన కొందరు రైతులకు విత్తనాలు ఇవ్వలేదని, వారికి మాత్రమే ఈ రోజు రావాలని చెప్పామన్నారు. స్టాకు లేదని, రైతులకు విత్తన పంపిణీ ఉండదన్న విషయాన్ని తాను ఆయా గ్రామాల సర్పంచుల ద్వారా తెలియజేశానని ఏవో చెప్పడంతో వారు మరింత ఆవేశానికి లోనయ్యారు. శనగలు అందని ఆయా గ్రామాల రైతులు పులివెందుల-ముద్దనూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వీరికి మద్ధతుగా మండల వైకాపా నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మండల వైకాపా పరిశీలకులు బండి రామమునిరెడ్డి, ఇంకా పలువురు నాయకులు బైఠాయించారు. రైతులకు సరిపడా పంపిణీ చేయకుండా స్టాకులేదని చెప్పడం తగదన్నారు.
చేతగాని మంత్రి వల్లే రైతుల ఇక్కట్లు
అన్ని విత్తనాలు సంవృద్ధిగా అందుబాటులో ఉన్నాయంటూ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు అధికారులిచ్చిన కాగితాల్లోని విత్తనాల నిల్వలు పదేపదే చెప్పి ఇప్పటిదాకా ఊదరగొట్టారు. కాని వాస్తవంగా ప్రస్తుతం పరిస్ధితి చూస్తూ ఏజిల్లాలో కూడా విత్తనాలు రైతులకు సక్రమంగా దొరకని పరిస్ధితి నెలకొంది. ప్రభుత్వం, వ్యవసాయ మంత్రి పుల్లారావు చేతగాని తనం వల్లే ప్రస్తుతం విత్తనాలకోసం రోడ్డిక్కి రైతులు ఆందోళనకు దిగాల్సి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
No comments:
Post a Comment