Saturday, October 22, 2016

పట్టాలు తప్పుతున్న రైళ్ళు; పరేషానవుతున్న ప్రయాణికులు

ఆప్రికాలో ఘోర రైలు ప్రమాదం; 53 మంది మృతి



ఆఫ్రికాలోని కామెరూన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దేశ రాజధాని యాండీ నుంచి దౌలా నగరానికి ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పటంతో 53 మంది మృతిచెందారు. స్థానిక మీడియా, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..భారీ వర్షాల కారణంగా యాండీ, దౌలా నగరాల మధ్య వంతెన కూలిపోయింది. దీంతో రోడ్డు మార్గం స్తంభించిపోవడంతో ప్రయాణికులంతా రైళ్లను ఆశ్రయించారు. కామెరూన్‌ కాలమానం ప్రకారం.. యాండీ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన రైలు.. మరి కాసేపట్లో ఎసెకా నగరానికి చేరుకుంటుందనగా.. ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 53 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 300 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారమందుకున్న రవాణాశాఖ అధికారులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

No comments:

Post a Comment