Tuesday, October 18, 2016

ఓడిశాలో ఘోర అగ్నిప్రమాదం; 22మంది మృతి

ఓడిశాలో ఘోర అగ్నిప్రమాదం; 22మంది మృతి


ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ శివారు షాంపూర్‌లోని సమ్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందారు. ఆసుపత్రి భవనంలోని డయాలసిస్‌ వార్డులో విద్యుత్తు షార్టుసర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వార్డులోని ఐసీయూలో 20 మంది, పక్కనున్న వార్డులో 50 మంది వరకు రోగులున్నారు. నాలుగంతుస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్‌లో ప్రమాదం జరగడంతో వార్డు, పరిసరాలు పొగతో నిండిపోయాయి. కిటికీలు, అద్దాలను పగులగొట్టి రోగులు, క్షతగాత్రులు, సహాయకులను ఆసుపత్రి బయటకు తెచ్చారు. ఐసీయూలో ఉన్నవారిని ఆసుపత్రి సిబ్బంది ఆమ్రీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మరికొందరిని కేపిటల్‌ ఆసుపత్రి, కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి, ఎయిమ్స్‌, కిమ్స్‌ ఆసుపత్రులకు తరలించారు. తరలిస్తుండగానే పది మంది వరకు కన్నుమూశారు. వూపిరాడక అస్వస్థతకు గురై వీరంతా మృతి చెందినట్లు ఆమ్రీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రోగులు, బంధువుల రోదనలతో సమ్‌ ఆసుపత్రి ప్రాంగణం భీతావహంగా మారింది. సంఘటన స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. బహుళ అంతస్థులో అగ్ని ప్రమాదాలను నివారించడానికి వాడే ప్రత్యేక అగ్నిమాపక వాహనాన్ని తీసుకొచ్చి మంటలను నియంత్రించారు. అగ్నిమాపక శాఖ, పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టరు మహంతి, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జరిగిన ఘటనపై భారత ప్రధాని మోడి దిగ్ బ్రాంతి వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment