Thursday, October 20, 2016

గుంటూరు నగరానికి 150 ఏళ్ళు

150 వసంతాల పండుగకు సిద్ధమౌతున్న గుంటూరు నగరం

రాజధాని నగరం అమరావతి (సి.ఆర్‌.డి.ఏ)లో అంతర్భాగమైన గుంటూరు నగరపాలకసంస్థ సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే గుంటూరు నగరం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన నేపధ్యంలో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించాలని అధికార, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఘనంగా ఉత్సవాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి ఛాంబర్‌లో జిల్లా పాలనాధికారి, జీఎంసీ ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే, జీఎంసీ కమిషనర్‌ నాగలక్ష్మి ఇతర అధికారులతో గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ సమావేశమయ్యారు. నగరంలో ప్రారంభించి పురోగతిలో ఉన్న అభివృద్ధి పనుల గురించి చŒర్చించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు, ందరికి ఇళ్లు పథకం పరిస్థితి అడిగి తెలుసుకుని అధికారులుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎం.పి. గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ 150 ఏళ్ల ఉత్సవాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రూ.850 కోట్లతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన ఉంటుందని చెప్పారు. నగరంలో తాగునీటి ఎద్దడి పూర్తిస్థాయిలో నివారించేందుకు ఉద్దేశించిన సమగ్ర తాగునీటి పథకం పనులు కూడా తుదిదశకు చేరాయన్నారు. తాగునీటి పథకం పనులతో నగరంలో అనేకచోట్ల గోతులమయంగా మారిందని పనులు పూర్తికాగానే రహదార్లపై గోతులన్నీ పూడ్చి చదును చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విలీనమైన 10 గ్రామాల్లో కూడా తాగునీటికి సమస్యలు రాకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కృష్ణాపుష్కరాల సందర్భంగా ప్రారంభించి మధ్యలో ఆగిన పనులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. నగరంలో ప్రధాన కూడళ్లు, రహదార్ల వెంట గ్రీనరీ పెంచి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. ఇక నుంచి ప్రతినెలా ఒకటి, రెండుమార్లు నగరాభివృద్ధి గురించి సమీక్షలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ గుంటూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు, మురికివాడల రహితనగరంగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

No comments:

Post a Comment