Wednesday, October 19, 2016

మోడిగారి మొసలి కన్నీరు

దళితులపై దాడులు అమానుషం; ప్రధాని మోడీ


దేశంలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మంగళవారం మరోమారు పెదవి విప్పారు. దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తున్నదన్నారు. లూథియా నాలో ఎస్సీ, ఎస్టీ జాతీయ హబ్‌ను ప్రారం భిస్తూ ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన ప్పటికీ దళితులపై దౌర్జన్యాలు కొనసాగడం అవమానకరంగా ఉందన్నారు. సామాజిక అసమానతలను సరిచేయడంపై మరింత దృష్టి పెట్టాలని మోడీ పిలుపునిచ్చారు. అంటరానితనం, కుల తత్త్వాలను నిరసిస్తూ గురుగోవింద్‌ సింగ్‌ గళమెత్తారని ఈ సందర్భంగా చెప్పారు. సమాజంలో నెలకొన్న కొన్ని అసమానతల కారణంగానే దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న సంఘటనలను చూడాల్సి వస్తున్నదన్నారు. దళిత, ఆదివాసీ యువత దేశంలోని ఇతర యువతకు తీసిపోరన్నారు. వారికి అవకాశాలు కల్పిస్తే దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో వెనకడుగు వేయరన్నారు. దళితులు, ఆదివాసీలు వ్యవస్థాపకులుగా రూపుదిద్దుకునేందుకు ఈ హబ్‌ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఇతరులకు కూడా ఉద్యోగాలు కల్పించే స్థాయికి వారు ఎదుగుతారన్నారు. స్టార్ట్‌ అప్‌ ఇండియా, స్టాండ్‌ అప్‌ ఇండియా పథకాల కింద ఎస్సీ, ఎస్టీ కేటగిరికి చెందిన వారికి కోటి రూపాయలు రుణాలు మంజూరు చేయాలని దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకుల శాఖలన్నిటిని ఆదేశించినట్లు చెప్పారు. దీని వలన 3.75 లక్షల మంది వ్యవస్థాపకులు రావడానికి మార్గం ఏర్పడుతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌ఎంఇ) కింద బడ్జెట్‌లో జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ను ప్రకటించారు. 

No comments:

Post a Comment