పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. క్వెట్టాలో పోలీసు శిక్షణా వసతి గృహంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 33మంది మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడి సమయంలో వసతి గృహంలో 600మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో పలువురిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వసతిగృహం దాడి ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు వసతిగృహంలో పలువురిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment