Tuesday, October 25, 2016

ఈడొచ్చినప్పుడే అచ్చటైనా ముచ్చటైనా....


30ఏళ్ళ తరువాత పెళ్ళి చేసుకున్నా వేస్టే




ముందు కెరియర్ తరువాత పెళ్లి అనుకోవడం తప్పులేదు కాని 30 ఏళ్లు లోపే మీరు లైఫ్‌లో సెటిల్ అయి లైఫ్ పార్టనర్‌ని వెతుక్కోవాలట లేదంటే ,తరువాత పెళ్లి చేసుకున్నా వేస్టే అంటున్నారు వైద్యులు. అనేక సర్వే రిపోర్ట్ లకారం 30 దాటితేనే కాని యువతీ యువకులు పెళ్లిపై ఆసక్తిని చూపించడం లేదట. దీనికి అనేక కారణాలు కూడా లేకపోలేదు. లైఫ్‌లో స్ధిరపడకపోవడం ఒకటైతే, సంబంధాలకోసం వెతుకుతూనే ఉండి దొరికిన వాళ్లతో సరిపెట్టుకోకపోవడం మరొక కారణం. సాధారణంగా వివాహానికి 18 నుండి 25 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. కాని అప్పుడే ఎందుకులే అనుకునే వారు 25 నుండి 30 వచ్చేసరికి పెళ్లి పీటలెక్కాల్సిందే. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు సంబంధాలు దొరక్క, తీరా దొరికాక అమ్మాయి నచ్చక వివాహ ఘడియలకు దూరం అవుతూ వస్తున్నారు. అయితే ఇంక లేటు చేయడం మంచిది కాదట వయసు ముదిరితే అనేక అనర్ధాలు జరిగే చాన్స్ చాలా ఎక్కువ ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.

పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి అనేది చాలా ముఖ్యం.  వీర్యకణాల్లోని శుక్రకణాల స్థాయి వయస్సు పెరిగే కొలదీ తగ్గుతూ వస్తుంది. ఒక మిల్లీలీటరు వీర్యకణాల్లో 135 మిలియన్ల శుక్రకణాలు ఉండాలి. కాని తాజా డబ్ల్యుహెచ్‌వో నివేదిక ప్రకారం 30 ఏళ్లుదాటిన వారిలో 105 కి ఈ శుక్రకణాల స్థాయి తగ్గినట్లు తేలింది. ఇక మహిళల విషయానికి వస్తే 30 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల విడుదల తగ్గిపోతుంది. అండం విడుదల సమస్య కారణంగా సంతానోత్పత్తికి సమస్యలు తలెత్తుతాయి. రెగ్యులర్‌గా వచ్చే పిరియడ్స్ కూడా క్రమం తప్పుతుంటాయి. అయితే 30 తరువాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన వారికి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి వైద్య నిపుణులు సలహాలనూ ఇస్తున్నారు. పురుషులు తమ వీర్యాన్ని స్మెర్మ్ బ్యాంక్‌లలో భద్రపరుకోవచ్చట. మహిళలు అయితే అండాన్ని ఎగ్ బ్యాంక్‌లో భద్రపరుచుకోవడం ద్వారా సమస్య నుండి కొంత విముక్తిని పొందినా 30 లోపు పెళ్లి చేసుకోవడమే మంచిదని సలహానిస్తున్నారు.

No comments:

Post a Comment