Wednesday, October 19, 2016

బాబు అమెరికా టూరు రద్దు వెనుక ఆంతర్యం ఏమిటి

చంద్రబాబు అమెరికా పర్యటన వాయిదా


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన వాయిదాపడింది. ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చే నెలలో ఆయన అమెరికాలో 9 రోజులపాటు పర్యటించాల్సి ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో పర్యటన వాయిదాపడిందని రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల సలహాదారుడు రవికుమార్‌ వెల్లడించారు. ముందుగా వారం, పది రోజులకు వాయిదా వేయాలనుకున్నా అమెరికాలో ఆ సమయంలో థ్యాంక్స్‌ గివింగ్‌ డే, ఆపై క్రిస్మస్‌ సెలవులు వస్తుండటం, జనవరిలో విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉండటంతో పర్యటన ఫిబ్రవరికి వాయిదా పడిందని ఆయన వివరించారు.

No comments:

Post a Comment