Saturday, October 22, 2016

మంత్రిగారి వాటా ఇచ్చేందుకు ఏకంగా డబ్బుతోనే విధాన సౌదకు వచ్చాడు

కర్ణాటక విధాన సౌధలో కారులో డబ్బు కలకలం; ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


కర్ణాటక విధాన సౌధ ఆవరణలోని అనుమానాస్పదంగా ప్రవేశించిన కారు నుంచి రూ.2.5కోట్లు బయటపడ్డాయి. కెంగెల్ హనుమంతయ్య ముఖద్వారం మీదగా విధాన సౌధలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోన్న కేఏ04 ఎంఎం9018 నంబర్ వోక్స్ వ్యాగన్ కారును పోలీసులు తనిఖీ చేశారు. వారి సోదాల్లో మూడు పెట్టెల్లో సర్ధిపెట్టిన నగదును గుర్తించారు.. వాహన యజమాని ధార్వాడకు చెందిన న్యాయవాది, మాజీ జడ్జి కుమారుడు సిద్ధార్థ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెండర్ కు సంబంధించి ఓ మంత్రికి ఇవ్వడానికి ఈ డబ్బు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ కారులో నుంచి రూ.1.97 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సిద్ధార్థను విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో లభ్యమైన నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవన్నారు. అయితే పొంతనలేని సమాధానాలతో పాటు, స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఆ నగదును తన వద్ద ఉంచుకున్నట్లు, అందుకు సంబంధించి పత్రాలు సమర్పించేందుకు తనకు కొంత సమయం కావాలని సిద్ధార్ధ కోరటం కొసమెరుపు.

No comments:

Post a Comment