Tuesday, October 25, 2016

మార్కెట్ లోకి మహీంద్రా కొత్తకారు

ఈటూఓ ప్లస్ ను రిలీజ్ చేసిన మహీంద్రా



పర్యావరణ సహిత ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెట్టిన మహీంద్ర తన ఈ2ఓకు కొనసాగింపుగా ఈ2ఓ ప్లస్ కారును తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ2ఓకు రెండు డోర్లుండగా.. ఈ2ఓ ప్లస్ నాలుగు డోర్లతో వస్తోంది. ఈ మహీంద్రా ఈ2ఓ ప్లస్ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ధరలు రూ. 5.46 లక్షల నుంచి రూ. 8.46 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ కొత్త ఈకో కారులో ఎస్ఓఎస్ ఫీచర్‌ను పొందుపరిచారు. దీని వల్ల బ్యాటరీ పవర్ 10 శాతాని కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కారు మరో 7 నుంచి 10 కి.మీ. నడవడానికి ఈ ఎస్ఓఎస్ ఫీచర్ సహకరిస్తుంది. ఈ కారుతో పాటు ఒక మొబైల్ యాప్‌ను కూడా మహీంద్రా విడుదల చేసింది. ఈ యాప్ సహాయంతో కారులోని కొన్ని ఫీచర్లను ఆపరేట్ చేయొచ్చు. ఎస్ఓఎస్ ఆన్/ఆఫ్, ఎయిర్ కండిషన్‌తో పాటు కార్‌ని లాక్, అన్‌లాక్ చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే చాలా బ్యాటరీ కార్లు పూర్తి ఛార్జింగ్‌తో 110 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ2ఓ‌ ప్లస్‌లో అమర్చిన 210ఏహెచ్ లిథియమ్ అయాన్ బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 140 కి.మీ. వరకు నడుస్తుంది. అంతే కాకుండా దీని టాప్ స్పీడ్ గంటకు 85 కి.మీ. ఈ2ఓ ప్లస్‌లో ఉన్న బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 9 గంటల సమయం పడుతుంది.

No comments:

Post a Comment