కావేరీకి ఎంత ధైర్యం...
కోర్టుకు వెళ్ళిన కావేరీ సీడ్స్; ప్రభుత్వానికే సవాల్
నకిలీపత్తి విత్తనాలను విక్రయించి అన్నదాతలను నట్టేటముంచిన కావేరి సీడ్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. గుంటూరు జిల్లాలో ఈ కంపెనీకి సంబంధించిన జాదు పత్తి విత్తనాలు నకిలీవని, వీటివల్ల ఈఏడాది నష్టపోయామంటూ రైతుల ఫిర్యాదుమేరకు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటను పరిశీలించి విత్తనాలు నకిలీవేనని నిర్థారించారు.
నష్టపోయిన రైతులకు సుమారు రూ.42 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా స్థాయిలోని కమిటీ ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 18లోపు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గడువులోగా యాజమాన్యం పరిహారం చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కావేరి సీడ్స్ లైసెన్సును రద్దు చేసింది. యాజమాన్య ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదం కొనసాగుతుండగా కావేరి యాజమాన్యం... జిల్లా కమిటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయొద్దని కోర్టును ఆశ్రయించింది. ఈతరుణంలో కోర్టులు అన్నదాతలకు అండగా నిలుస్తాయో లేక మోసకారి విత్తనకంపెనీల భరతం పడతాయో ప్రజలంతా వేచిచూస్తున్నారు.
No comments:
Post a Comment