అమరావతి సాహిత్య వైభవం ఈనాటిది కాదు; సీనియర్ జర్నలిస్టు మల్లిఖార్జునరావు
గుంటూరు బ్రాడీపేట 2/1 లోని S H O మందిరంలో రావి రంగారావు గారు స్థాపించిన "అమరావతి సాహితీ మిత్రులు" ఆధ్వర్యంలో సభా కార్యక్రమం జరిగింది. సభలో వచనకవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు కవితా వైభవం అనే అంశంపై పలువురు వక్తులు ప్రసంగించారు. తెలుగు సాహిత్యంలో వచనకవిత ప్రాధాన్యం,కుందుర్తి విశేషాలపై ప్రముఖ జర్నలిస్టు మల్లిఖార్జునరావుగారు చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. అమరావతి ప్రాంతం ఒకనాడు సాహిత్యానికి పెట్టింది పేరని, కుందుర్తి లాంటి ఎంతోమంది సాహితీవేత్తలకు పుట్టినల్లంటూ ఆయన కొనియాడారు. ఆచార్య ఎస్. గంగప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత రావినూతల శ్రీరాములు గారు రచించిన టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర పుస్తకాన్ని M L C రామకృష్ణ ఆవిష్కరించారు.కవి, రచయిత, పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, జిల్లా పరిషత్ ఇంచార్జ్ C E O. సోమేపల్లి వెంకట సుబ్బయ్య, మంగళగిరి ప్రమీలా దేవి, భూసురపల్లి వెంకటేశ్వర్లు,డాక్టర్ తాతా సేవ కుమార్ తదితర ప్రముఖులు ప్రసంగించారు.
No comments:
Post a Comment