ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలతో జనంలోకి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి చరిష్మాకలిగిన నేతలు లేకపోవటంతో రోజురోజుకు ఆపార్టీ గడ్డుపరిస్ధితులను ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేశాక కాంగ్రెస్ కు పునర్ వైభవం దక్కుతుందని అందరూ భావించినా ఏమాత్రం మార్పులేకుండా పోయింది. దీంతో లాభం లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ, తిరిగి ఇందిర గాంధీని తెరపైకి తీసుకువచ్చి అనాడు పేదలకోసం ఆమే చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేసి మళ్ళీ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలన్న వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ భారీస్థాయిలో సన్నాహాలు చేస్తోంది. నవంబరు 19వ తేదీ ఇందిర జయంతిని పురస్కరించుకొని, ఆ రోజు నుంచి ఏడాదిపాటు వివిధ రూపాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. సీనియర్ నేత ఆనంద్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలో జరిగే శతజయంతి సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు. ఇదే వేదికపై సోనియా కీలక ఉపన్యాసం ఇస్తారు. కాగా, అన్ని రాష్ట్రాల్లో ఇందిరపై సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.
No comments:
Post a Comment