Monday, October 17, 2016

జైట్లీపైనే బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి విసుర్లు

అదాయపన్నుశాఖను మూసేయండి; బిజెపి సుబ్రహ్మణ్య స్వామి  సంచలన వ్యాఖ్యలు
జైట్లీ తీరుపై అసంతృప్తి



ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉన్నా.. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తీరు అసంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. ఇండియన్‌ పొలిటికల్‌ సెంటర్‌ కాన్‌క్లేవ్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక ఆంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఆదాయపన్ను శాఖను మూసేసి దానిలోని అధికారులను రహదారులు భవనాల ప్రాజెక్టుల్లో నియమిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి పనితీరు అసంతృప్తికరంగా ఉంది.. ఆయనతో ఎలా వ్యవహరించాలో ప్రధానికి మాత్రమే తెలుసన్నారు. ఉగ్రస్థావరాలపై లక్షిత దాడులను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ 1971 యుద్ధాన్ని కాంగ్రెస్‌ వాడుకున్నప్పుడు తాము దీనిని వాడుకోవడంలో తప్పేముంది అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. ఏ పార్టీ కేవలం అభివృద్ధి అంశంమీదే ఎన్నికల్లో విజయం సాధించదన్నారు. భాజపా అయోధ్యలో రామమందిరంపై కీలక నిర్ణయం తీసుకుంటుందని ప్రజల్లో విశ్వాసం కలిగిస్తే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను తేలిగ్గా గెలిచే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు శాంతిభద్రతల అంశం కూడా వచ్చే ఎన్నికల్లో చాలా ముఖ్యమైందన్నారు.

No comments:

Post a Comment